హోమ్ / వార్తలు / ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్‌, డీజిల్‌ పై డిస్కౌంట్‌
పంచుకోండి

ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్‌, డీజిల్‌ పై డిస్కౌంట్‌

ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్‌, డీజిల్‌ పై డిస్కౌంట్‌

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట ఈ అర్ధరాత్రి  నుంచి అమల్లోకి రానుంది. డిజిటల్‌ చెల్లింపుల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకునే వారికి 0.75 శాతం రాయితీ ఇవ్వనున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీ ప్రకటించింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల, ఈ-వాలెట్లు లేదా మొబైల్‌ వాలెట్లు ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది.
లీటరు పెట్రోల్‌ పై 49 పైసలు, లీటరు డీజిల్‌ పై 41 పైసలు రాయితీగా ఇస్తారు. కార్డు ద్వారా చెల్లించిన మూడు రోజుల తర్వాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడతాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు