హోమ్ / వార్తలు / ఈ నెల 8 నుంచి వికలాంగులకు సదరం క్యాంపులు
పంచుకోండి

ఈ నెల 8 నుంచి వికలాంగులకు సదరం క్యాంపులు

ఈ నెల 8 నుంచి వికలాంగులకు సదరం క్యాంపులు

ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణలో వికలాంగులకు సదరం క్యాంపులు ప్రారంభిస్తు న్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వనస్థలి పురం, కొండాపూర్‌, తాండూరులలో సదరం క్యాంపులు నిర్వహించేందుకు నిర్ణయిం చామని చెప్పారు. కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో ప్రతి బుధవారం, తాండూరు జిల్లా ఆసుపత్రిలో ప్రతి గురువారం, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్లు పొందగోరు వికలాంగులు ఈ విషయాన్ని గమనించి పైన సూచించిన రోజుల్లో క్యాంపులకు హాజరుకావాలని సూచించారు.

ఆదరం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు