హోమ్ / వార్తలు / ఉద్యోగుల ఆదాయ వివరాల సమర్పణకు గడువు పెంపు
పంచుకోండి

ఉద్యోగుల ఆదాయ వివరాల సమర్పణకు గడువు పెంపు

ఉద్యోగుల ఆదాయ వివరాల సమర్పణకు గడువు పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ వివరాలను సమర్పించేందుకు జులై 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు సిబ్బంది, శిక్షణశాఖ సీనియర్‌ అధికారి తెలిపారు. దీనికి ఏప్రిల్‌ 15 చివరి తేదీ కాగా ఈ గడువును జులైకి పొడిగించామన్నారు. 2014 నుంచి గడువును పొడిగించడం ఇది అయిదో సారి. లోక్‌పాల్‌ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ ఆదాయ వివరాలను సమర్పించాలి. ఉద్యోగులు ఈ ఏడాది జులై 31 లోపు 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆదాయ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు