హోమ్ / వార్తలు / ఉపాధి హామీకి ఆధార్‌ తప్పనిసరి
పంచుకోండి

ఉపాధి హామీకి ఆధార్‌ తప్పనిసరి

ఉపాధి హామీకి ఆధార్‌ తప్పనిసరి

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు పొందాలంటే ఆ పథకం లబ్ధిదారులు ఆధార్‌ సంఖ్యను కలిగిఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద ఏడాదికి 100 పనిదినాలను కల్పించాల్సి ఉంది. దీనికోసం లబ్ధిదారులు తమ పేర్లను ముందుగా నమోదుచేయించుకుని జాబ్‌కార్డు పొందాలి. దీనికిగాను మార్చి 31వ తేదీలోగా ఆధార్‌ సంఖ్యను సమర్పించాలని, లేకుంటే ఏప్రిల్‌ 1 నుంచి పనిని కేటాయించబోరని అధికారులు విస్పష్టం చేశారు. అయితే, ఆధార్‌ సంఖ్య లేనివారు అది పొందేవరకూ తమ రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డు, కిసాన్‌ పాస్‌పుస్తకం, గజిటెడ్‌ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం లేదా ఉపాధి హామీ జాబు కార్డులలో ఏదో ఒక దానిని తమ గుర్తింపు పత్రంగా చూపించి ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆధార్‌కార్డుకు దరఖాస్తుచేసుకున్నా అది రానివారు నమోదు పత్రాన్ని అయినా సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. మరోవైపు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ కూడా తన పింఛనుదారులు ఈ నెలాఖరులోగా తమ ఆధార్‌ సంఖ్యను లేదా ఆధార్‌ నమోదుకు చేసుకున్నామన్న ధ్రువపత్రానైనా సంస్థకు తెలియజేయాలని పేర్కొంది. సామాజిక భద్రత కింద లభించే ప్రయోజనాలు పొందాలంటే ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు