హోమ్ / వార్తలు / ఉర్దూపత్రికారచయితలు సాంకేతిక ఎదుగుదలను అందిపుచ్చుకోవాలి
పంచుకోండి

ఉర్దూపత్రికారచయితలు సాంకేతిక ఎదుగుదలను అందిపుచ్చుకోవాలి

ఉర్దూపత్రికారచయితలు సాంకేతిక ఎదుగుదలను అందిపుచ్చుకోవాలి

కేంద్ర సమాచార & ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన మరియు గృహ‌నిర్మాణ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఉన్న మౌలానాఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎమ్ ఎ ఎన్ యు యు) డిడిఇ ఆడిటోరియమ్ లో కెపాసిటీబిల్డింగ్ ఫర్ ది వర్కింగ్ ఉర్దూ జర్నలిస్ట్ స్ ఆఫ్ తెలంగాణ అండ్ దేరబౌట్స్అంశంపై ఈ రోజుజరిగిన వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశానికి ఒక గొప్ప సంస్కృతి,వారసత్వం ఉన్నాయి, వాటిని మనంపరిరక్షించుకోవలసి ఉందన్నారు. మనం మన దేశమన్నా, మన సాంస్కృతిక వారసత్వమన్నా గర్వపడాలి అని ఆయనచెప్పారు.  ఒక భాషగా చూస్తే ఉర్దూ భాషలోఉన్న తీయదనం విశిష్టమైందన్నారు. ఉర్దూ పత్రికారచన, ఉర్దూ వార్తాపత్రికలు భారతదేశ స్వాతంత్ర్యసమరానికి గణనీయమైన తోడ్పాటును అందించాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. జాతినిర్మాణంలో వాటి భూమిక దేనికీ తక్కువది కాదు అన్నారాయన. మౌలానా ఆజాద్ నడిపిన ‘అల్హిలాల్’ వార్తాపత్రిక  హిందూ ముస్లిములఐకమత్యం కోసం పాటుపడిందని, భారత జాతీయత యొక్క సంఘటిత ఆదర్శ భావాలనుపటిష్టపరచిన ఆ పత్రికను ఎవరు మాత్రం మరువగలరు? అంటూ కేంద్ర మంత్రి గుర్తుచేశారు. మౌలానా ఆజాద్ప్రచురణలు యువ భారతీయ ముస్లిములు జాతీయ పోరాట రంగంలోకి దుమికేటట్లు వారినిప్రోత్సహించాయని ఆయన అన్నారు. భారతీయ యువతీయువకులలో జాతీయతాభావాన్ని విస్తృత‌ంచేయడంలో ‘నకీబ్ ఎ హమ్ దర్ద్’, ‘ప్రతాప్’, ‘మిలాప్’, ‘కౌమీ ఆవాజ్’, ‘జమీందార్’, ‘హిందుస్తాన్’ వంటి ఉర్దూ పత్రికలు పోషించినపాత్రను ఎవ్వరూ ఉపేక్షించజాలరని ఆయన వ్యాఖ్యానించారు. ఉర్దూ అనేది కేవలం ముస్లిములభాష మాత్రమే కాదు, అది భారతీయులందరి భాష అని చెప్పారు. నిజానికి 1822లో శ్రీ హరిహర్దత్తా కలకత్తాలో మొట్టమొదటి ఉర్దూ పత్రిక జమీజహనుమా ను నెలకొల్పారని తెలిపారు.రెండో ఉర్దూ పత్రిక ను కూడా ఒక హిందువు శ్రీ మున్షీ హర్ సుఖ్ రాయ్ 1850లో ఏర్పాటుచేశారని చెప్పారు. ఈ విధంగా చూస్తే ఉర్దూ భారతీయులందరి సాంస్కృతిక వారసత్వం. ఉర్దూజర్నలిజం త్వరలో 200 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోనుందనివివరించారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు