హోమ్ / వార్తలు / ఎమ్ఎస్ఎమ్ఇ లలో నైపుణ్యానికి పదునుపెట్టాలి
పంచుకోండి

ఎమ్ఎస్ఎమ్ఇ లలో నైపుణ్యానికి పదునుపెట్టాలి

ఎమ్ఎస్ఎమ్ఇ లలో నైపుణ్యానికి పదునుపెట్టాలి

సరైన సమాచారంలోపించడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ) రంగం అభివృద్ధికి ఒక అవరోధంగామారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ‘ఎమ్ఎస్ఎమ్ఇ రంగం: నిరోధాలు-సవాళ్లు’ అనే అంశంపై ఈ రోజు హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ఆఫ్ ఇండియా లో జరిగిన ఒక చర్చాసభను ఉద్దేశించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బిఐ)హైదరాబాద్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ & డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ (ఎఫ్ఐ డిడి) సి. నాగేశ్వరరావుమాట్లాడుతూ, దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎమ్ఎస్ఎమ్ఇ రంగమని,చిన్న, మధ్యతరహా సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ)లకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు లభిస్తున్నాయని, అయితే ఆ సంస్థలపై ఎటువంటి వివక్షను ప్రదర్శించకూడదని చెప్పారు.ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలోని నైపుణ్య విభాగాలను మరింతగా తీర్చిదిద్దవలసి ఉందన్నారు. ఈరంగానికి సంబంధించి ఆర్ బిఐ మార్గదర్శక సూత్రాలను తు.చ. తప్పకుండా అనుసరించాలనిఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో అడిషనల్డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె. సుధాకర్ పాల్గొని ప్రసంగిస్తూ ఎమ్ఎస్ఎమ్ఇ బ్యాంకు, ఎమ్ఎస్ఎమ్ఇ యూనివర్సిటీ లను ఏర్పాటుచేయవలసిన అవసరం ఉందన్నారు. సూక్ష్మ, చిన్న,మధ్యతరహా సంస్థల జాతీయ సంస్థ (ఎన్ఐ- ఎమ్ఎస్ఎమ్ఇ) ఈ రంగంలోని వేలాదిదేశీయ, అంతర్జాతీయ ఔత్సాహికపారిశ్రామికవేత్తలకు శిక్షణను అందిస్తోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింతమహనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తున్న ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలోని ఔత్సాహికపారిశ్రామికవేత్తలు ఉత్పాదకతను పెంచే విధంగాను, నాణ్యమైన సేవలను,ఉత్పత్తులను అందించే విధంగాను వారికి నైపుణ్యాల అభివృద్ధి సంబంధితశిక్షణను సమకూర్చవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగాఎమ్ఎస్ డిఐ ఆఫ్ ఇండియా కు చెందిన శ్రీ అరవింద్ పట్వారీ ఎమ్ఎస్ఎమ్ఇ చట్టం, 2006కు ప్రతిపాదించిన సవరణల ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు.  పూర్వ బ్యాంకర్ కోటేశ్వరరావు పబ్లిక్ సెక్టర్ రీకన్ స్ట్రక్షన్ ఏజెన్సీ (పిఎఆర్ఎ)ఆల్టర్నేటివ్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ వంటి వాటిని గురించి సభికులకు వివరించారు.చర్చాసభ కన్వీనర్ ఎమ్. ప్రభాకర్ రావు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎమ్ఎస్ఎమ్ఇ రంగం ఎదుర్కొంటున్న సమస్యలనుగురించి సభకు తెలియజేశారు. రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులతోపాటు, పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొనగాఆ చర్చాసభ విజయవంతంమైంది. ఈ ఒక రోజు సెమినార్ ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్ అండ్మీడియం ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగింది.

***

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు