హోమ్ / వార్తలు / ఎస్‌బీఐ కొలువుల జాతర , 2,313 పీవో పోస్టుల భర్తీ.. నోటిఫికేషన జారీ
పంచుకోండి

ఎస్‌బీఐ కొలువుల జాతర , 2,313 పీవో పోస్టుల భర్తీ.. నోటిఫికేషన జారీ

ఎస్‌బీఐ కొలువుల జాతర , 2,313 పీవో పోస్టుల భర్తీ.. నోటిఫికేషన జారీ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ)లో కొలువుల జాతరకు తెరలేచింది. భారీ సంఖ్యలో ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 2,313 పోస్టుల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మధ్య కాలంలో, అందునా అధికారిక స్థాయి పోస్టులతో విడుదలైన భారీ ప్రకటన ఇదేనని చెప్పొచ్చు. ఏ డిసిప్లినలోనైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌/ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును తొలిసారిగా ఎస్‌బీఐ కల్పించింది. సివిల్స్‌ మాదిరిగానే జనరల్‌ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే పీవో పరీక్ష రాసేలా నిబంధనను సవరించింది. మెయిన్ ఎగ్జామ్‌లో నేరుగా జనరల్‌ అవేర్‌సెస్‌ ఒక టాపిక్‌గా ఉంది. దానిని జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నె్‌స్‌గా మార్చింది. అలాగే రీజనింగ్‌లోనే కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ను కలిపేసింది. ప్రిలిమినరీ పరీక్షను యథాతథంగా ఉంచింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు