హోమ్ / వార్తలు / ఎస్సై దరఖాస్తుల్లో’ తప్పులు దిద్దుకునే అవకాశం
పంచుకోండి

ఎస్సై దరఖాస్తుల్లో’ తప్పులు దిద్దుకునే అవకాశం

ఎస్సై దరఖాస్తుల్లో’ తప్పులు దిద్దుకునే అవకాశం

ఎస్సై ఉద్యోగాలకు తుది పరీక్షలు రాసిన వారు తమ దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ పూర్ణచంద్రరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుది పరీక్ష రాసిన అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను నియామక మండలి వెబ్‌సైట్లో సోమవారం ఉంచి అందుబాటులో ఉంచామన్నారు. వీటిని పరిశీలించి దరఖాస్తులో తప్పులు దొర్లినట్లు భావిస్తే వెబ్‌సైట్లో ఉంచిన పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఓసీ అభ్యర్థులైతే రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీలైతే రూ.500 చెల్లించి తప్పులు సరిదిద్దుకోవాలన్నారు. ఇలా సరిదిద్దిన పత్రాన్ని, దానికి సంబంధించిన అసలు ధ్రువపత్రాలను తీసుకొని తమకు కేటాయించిన సమయంలో జిల్లా ఎస్పీలు, కమిషనర్లను కలవాలన్నారు. ఈ సదుపాయం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు