హోమ్ / వార్తలు / ఏపీలో 6 నుంచి 10 వరకు ‘కామన్‌’
పంచుకోండి

ఏపీలో 6 నుంచి 10 వరకు ‘కామన్‌’

పదిలో ‘వెయిటేజీ’ సంస్కరణలు 480 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు 120 మార్కులు అంతర్గత మూల్యాంకనం 2017-18 నుంచి అమలు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

పరీక్షల మూల్యాంకన విధానంలో సంస్కరణలకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 6 నుంచి 10వ తరగతి వరకూ కామన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతర్గత మూల్యాంకన మార్కులకు వెయిటేజీ ఇస్తూ పరీక్షల్లో సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో అంతర్గత మూల్యాంకన మార్కులకు మొత్తం 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. 8వ తరగతి అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో సాధించిన మార్కులకు 5 శాతం, 9వ తరగతి అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో పొందిన మార్కులకు 5 శాతం, 10వ తరగతి అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో సాధించిన మార్కులకు 10 శాతం వెయిటేజీ ఇస్తారు. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. అంటే ఆ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు వీటిని వర్తింపజేస్తారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలలోని పాఠశాలలన్నింటిలో సంస్కరణలు వర్తింపజేస్తున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పేపర్లు ఉంటాయి. సెకండ్‌ లాంగ్వేజ్‌ (తెలుగు/హిందీ) సబ్జెక్టులో ఒకే పేపర్‌ 100 మార్కులకు, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, థర్డ్‌ లాంగ్వేజ్‌, మాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబెక్టుల్లో రెండు పేపర్లుగా 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రతి పేపర్‌లోనూ 80శాతం మార్కులకు పబ్లిక్‌ పరీక్ష, 20 శాతం మార్కులకు ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అంటే మొత్తం మీద పబ్లిక్‌ పరీక్షలను 480 మార్కులకు నిర్వహించి , 120 మార్కులను అంతర్గత మూల్యాంకనానికి కేటాయించారు. దీంతో ఇకపై పరీక్షల నిర్వహణలో ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షల విధానంలో సంస్కరణలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఈ సంవత్సరం నుంచి మూల్యాంకన విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు