హోమ్ / వార్తలు / ఏపీలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం నిర్వహణపై .
పంచుకోండి

ఏపీలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం నిర్వహణపై .

ఏపీలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం నిర్వహణపై పర్యవేక్షణను పటిష్టం చేయాలని కేంద్రం సూచించింది

ఏపీలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం నిర్వహణపై పర్యవేక్షణను పటిష్టం చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర స్థాయిలో పనులను పర్యవేక్షించేందుకు టెక్నికల్‌ సిబ్బందిని కేటాయించాలని, పంచాయితీ స్థాయిలో ఆస్తులను జియోట్యాగింగ్‌ చేసి ఈ నెల నుంచే అసెట్‌ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇటీవల లేబర్‌ బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ సమర్పించిన లేబర్‌ బడ్జెట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉపాధి పథకం ద్వారా ఈ ఏడాది రాష్ట్రంలో రూ.5320 కోట్ల మేర పనులతో పాటు, 16.53 కోట్ల పనిదినాలు కల్పించేలా రూపొందించిన ఏపీ లేబర్‌ బడ్జెట్‌కు కేంద్ర అధికారులు పచ్చజెండా ఊపారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు