హోమ్ / వార్తలు / ఏపీలో కొత్త ఆరోగ్య పథకాలు
పంచుకోండి

ఏపీలో కొత్త ఆరోగ్య పథకాలు

ఏపీలో కొత్త ఆరోగ్య పథకాలు

ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. నూతన సంవత్సరంలో పలు ఆరోగ్య పథకాలు తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017 మార్చి నుంచి ‘ఆరోగ్య రక్ష’ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య రక్ష పథకం కింద రూ.2లక్షల విలువైన వైద్య ఖర్చులు ఉచితమని తెలిపారు. నెలకు వందరూపాయలతో కుటుంబానికి ఆరోగ్య పాలసీ లభిస్తుందన్నారు. చుక్కల భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ‘‘పట్టిసీమ 12 నెలల్లో పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం చేస్తామన్నారు... పట్టిసీమ పూర్తయిన తర్వాత ఎవరూ మాట్లాడటం లేదు. నీటి నిర్వహణలో ఈ ఏడాది రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. నీటి కొరత లేకుండా వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చాం. జూన్‌ 2 నాటికి ఇంటింటికీ గ్యాస్‌ ఇవ్వాలనే లక్ష్యంతో వెళ్తున్నాం. 149 రూపాయలకు 15 ఎంబీపీఎస్‌తో అంతర్జాల సేవలు అందిస్తున్నాం’’ అని సీఎం వివరించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు