హోమ్ / వార్తలు / ఒకేషనల్‌ విద్యార్థులకు అప్రెంటిస్‌ శిక్షణ
పంచుకోండి

ఒకేషనల్‌ విద్యార్థులకు అప్రెంటిస్‌ శిక్షణ

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వృత్తివిద్యా (ఒకేషనల్‌)కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మైక్రోమ్యాక్స్‌ సంస్థ వారు ఉచితంగా అప్రెంటిస్‌ శిక్షణ ఇవ్వనున్నారని ఇంటర్‌ విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎ.అశోక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వృత్తివిద్యా (ఒకేషనల్‌)కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మైక్రోమ్యాక్స్‌ సంస్థ వారు ఉచితంగా అప్రెంటిస్‌ శిక్షణ ఇవ్వనున్నారని ఇంటర్‌ విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎ.అశోక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత మూడేళ్లలో అకడమిక్‌ విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన 200 మంది విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. మైక్రోమ్యాక్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీలో ఈ అప్రెంటిస్‌ శిక్షణ ఏడాది ఉంటుందని తెలిపారు. శిక్షణ కాలంలో నెలవారీ రూ.8200 స్టైఫెండ్‌తో పాటు ఇ.ఎస్‌.ఐ, పి.ఎఫ్‌, సబ్సిడీ, భోజన సదుపాయాలు కూడా కల్పించబడతాయని ఆయన వివరించారు. ఇందుకోసం ఈనెల 25వ తేదీన ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి, కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్‌ కళాశాల వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. వివరాలకు 040-24732475, 27807198.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు