హోమ్ / వార్తలు / ఒక్కపైసాతో రైల్వే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌
పంచుకోండి

ఒక్కపైసాతో రైల్వే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌

ఒక్కపైసాతో రైల్వే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌

దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఒక్కపైసా రుసుంతో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టింది. 92పైసలున్న ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను శుక్రవారం నుంచి ఒక్కపైసాకు తగ్గిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్‌ 1నుంచి రైల్వేశాఖ ప్రయాణికులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 31 వరకూ మాత్రమే ఈ ఒక్కపైసా ఇన్సూరెన్స్‌ పథకం అమలులో ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌ ఏకే మనోచా పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 2016-17 రైల్వే బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ బీమాను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు