హోమ్ / వార్తలు / ఓటు వేయకపోతే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు: సుప్రీం
పంచుకోండి

ఓటు వేయకపోతే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు: సుప్రీం

ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ఆరోపించే హక్కు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన వాయిస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో సంస్థ ప్రతినిధి ధనేష్, దేశంలోని అక్రమ ఆక్రమణలపై స్పందించని ప్రభుత్వాలపై వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దిసభ్య ధర్మాసనం అసలు మీరు ఓటు వేశారా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తాను ఇంత వరకు ఓటు వేయలేదని ఆయన చెప్పడంతో, అయితే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ఆరోపించే హక్కు ఆయనకు లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి తీర్పుతో అనేక సమస్యలు వస్తాయన్న సుప్రీం కోర్టు, కావాలంటే దీనిపై రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించ వచ్చని సూచించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

ఓటు వేయకపోతే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు: సుప్రీం
05-02-2017 19:41:13

న్యూఢిల్లీ: ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ఆరోపించే హక్కు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన వాయిస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో సంస్థ ప్రతినిధి ధనేష్, దేశంలోని అక్రమ ఆక్రమణలపై స్పందించని ప్రభుత్వాలపై వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు.

పైకి వెళ్ళుటకు