హోమ్ / వార్తలు / కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు
పంచుకోండి

కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు

కానిస్టేబుల్’ రాత పరీక్షకు 99.64 % మంది హాజరు

కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించినరాత పరీక్షకు రికార్డు స్థాయిలో 99.64 శాతం మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. తెలంగాణ పోలీసు శాఖ పరిధిలో పోలీసు కానిస్టేబుల్(సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్(పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఈ రాత పరీక్షకు మొత్తం 81,357 మంది అభ్యర్థుల్లో 81,070 మంది హాజరయ్యారు. మూడు నెలల్లో ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు