హోమ్ / వార్తలు / కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం
పంచుకోండి

కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం

కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం

రుతుపవనాల ఆగమనంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేసింది. ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో పొలాలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురుస్తున్నాయి.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు