హోమ్ / వార్తలు / గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌
పంచుకోండి

గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌

గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2017-18 విద్యా సంవత్సరానికిగాను ఐదో తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది అన్ని గురుకులాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఏ వర్గం గురుకులాల్లో చేరాల్సిన విద్యార్థులైనా ఒకే ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. రేపటి (17వ తేదీ) నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షకు 11 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఏదేనీ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ. 1.5లక్షలు, పట్టణాల్లో రూ. 2లక్షలకు మించరాదు. దరఖాస్తు చేసేందుకు ఆధార్‌ నంబరు తప్పనసరిగా ఉండాలి. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 4న నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు టోల్‌ ఫ్రీ నంబరు 180042545678కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు