హోమ్ / వార్తలు / జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు రాత పరీక్ష ఫిబ్రవరి 19న
పంచుకోండి

జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు రాత పరీక్ష ఫిబ్రవరి 19న

జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులకు రాత పరీక్ష ఫిబ్రవరి 19న

ఉమ్మడి హైకోర్టు పరిధిలో 53 జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 19న రాత పరీక్ష జరగనుంది. 53 పోస్టుల భర్తీ నిమిత్తం గత ఏడాది నవంబరు 11న నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌ (నియామకం) బుధవారం విడుదల చేశారు. 53 పోస్టుల్లో నేరుగా నియామకాల ద్వారా 43 పోస్టులను, బదిలీల ద్వారా 10 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ అయింది. నేరుగా నియామకాల్లో 8 దరఖాస్తులను, బదిలీపై నియామకాల్లో 12 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఫిబ్రవరి 19న జరిగే పరీక్షకు కేంద్రాలను తరువాత ప్రకటించనున్నారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు