హోమ్ / వార్తలు / జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ జారీ
పంచుకోండి

జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ జారీ

జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ జారీ

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2017 షెడ్యూలు గురువారం విడుదలైంది. ఈ మేరకు మద్రాసు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్-2017 వెబ్‌సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది.

అర్హత వివరాలు
  • 1992 అక్టోబర్ 1న లేదా ఆ తరువాత జన్మించిన వారు ఈ పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఒక అభ్యర్థి గరిష్టంగా మూడు సార్లు, వరుసగా అయితే రెండుసార్లు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది.
  • ఇంటర్ వార్షిక పరీక్షలు 2016 రాసినవారు, 2017లో రాయబోయే వారు అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు రాయవచ్చు.
  • ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది, కాలేజీల్లో రిపోర్టింగ్ చేశాక సీటు రద్దు చేసుకున్న వారు ఈ పరీక్ష రాసేందుకు అనర్హులు.
  • 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు లభించాక యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్ చేయని వారు (జాయింట్ సీట్ అలోకేషన్‌లో భాగంగా రిపోర్టింగ్ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయని వారు) ఈ పరీక్ష రాయవచ్చు.
  • ఏదైనా ఐఐటీల్లో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరిన వారు 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకావచ్చు.


పూర్తిస్థాయి షెడ్యూల్ ఇదీ..
► 2-4-2017: జేఈఈ మెయిన్ (ఆఫ్‌లైన్) పరీక్ష
► 27-4-2017: జేఈఈ మెయిన్ ఫలితాలు
► 28-4-2017 నుంచి 2-5-2017 వరకు: అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ (ప్రారంభ తేదీన ఉదయం 10 నుంచి.. చివరి తేదీన సాయంత్రం 5 గంటల వరకు)
► 3-5-2017 నుంచి 4-5-2017 వరకు: ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌కు అవకా శం
► 10-5-2017 నుంచి 21-5-2017 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
► 21-5-2017: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2)
► 31-5-2017 నుంచి 3-6-2017 వరకు: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన, విజ్ఞప్తుల స్వీకరణ
► 4-6-2017: వెబ్‌సైట్‌లో అందుబాటులోకి  జవాబుల ‘కీ’లు
► 4-6-2017 నుంచి 6-6-2017 వరకు: అభ్యంతరాల స్వీకరణ
► 11-6-2017: అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి
► 11-6-2017 నుంచి 12-6-2017 వరకు: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
► 14-6-2017: ఉదయం 9 నుంచి  మధ్యాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష
► 18-6-2017: ఏఏటీ ఫలితాల విడుదల
► 19-6-2017 నుంచి 18-7-2017 వరకు: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు