హోమ్ / వార్తలు / జేఈఈ వెబ్‌సైట్‌లో ఆధార్ సహాయక కేంద్రాలు
పంచుకోండి

జేఈఈ వెబ్‌సైట్‌లో ఆధార్ సహాయక కేంద్రాలు

జేఈఈ వెబ్‌సైట్‌లో ఆధార్ సహాయక కేంద్రాలు

డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ఆధార్ నంబర్ లేని విద్యార్థులు ఆధార్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జేఈఈ పరీక్ష కేంద్రాలు ఉండే ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఆయా కేం ద్రాలకు వెళ్లి ఆధార్ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపింది. తద్వారా వచ్చే ఆధార్ నంబర్ కాకుండా ఎన్‌రోల్ చేసుకోవడం ద్వారా వచ్చే ఐడీ నంబర్‌తో జేఈఈకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఆయా కేంద్రాల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సదుపాయం లేకపోతే.. విద్యార్థులు అదే కేంద్రంలో ఆధార్ కోసం విజ్ఞాపన పత్రం అందజేస్తే ఓ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారని, దానితో విద్యార్థులు జేఈఈ మెరుున్‌కు దరఖాస్తు చేసుకోవచ్చంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 104 ఆధార్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే ఆయా పట్టణాల్లో జేఈఈ మెరుున్ రాత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. వివరాలకు జేఈఈ వెబ్‌సైట్ jeemain.nic.inను సంప్రదించవచ్చు.

 

ఆధారం: సాక్షి

 

పైకి వెళ్ళుటకు