డిజిటల్’ సందేహాల నివృత్తికి.. 14444
డిజిటల్’ సందేహాల నివృత్తికి.. 14444
డిజిటల్ లావాదేవీలు నిర్వహించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు కేంద్రం ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 14444ను ప్రారంభించింది. డిజిటల్ పేమెంట్ల విషయంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులుంటే ఈ నంబర్‌కు ఫోన్ చేసి సహాయాన్ని పొందవచ్చునని వెల్లడించింది. ఈ మధ్యే ఆవిష్కరించిన ‘భీమ్’ యాప్, ఈ-వాలెట్లు, ఆధార్ ఆధారంగా చెల్లింపుల వ్యవస్థ, యూఎస్ఎస్ డీ తదితరాలపై కూడా వినియోగదారులు ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ టోల్ ఫ్రీ నంబర్ దేశ ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ప్రజలకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుందని, త్వరలోనే ఈ సేవలను దేశమంతటా విస్తరిస్తామని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు.
ఆధారం: ఆంధ్ర జ్యోతి