హోమ్ / వార్తలు / తగ్గిన పత్తి సాగు
పంచుకోండి

తగ్గిన పత్తి సాగు

ఏపీ, మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇంతే పప్పుదినుసులు, నూనెగింజల వైపు రైతుల మొగ్గు

దేశవ్యాప్తంగా పత్తిసా గు తగ్గిందని, ఈ ఏడాది ఏడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభావం 2016-17 పత్తి మార్కెటింగ్‌ సీజన్‌పై తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడిం ది. పత్తికి బదులు పప్పుదినుసులు, నూనెగింజల సాగు పెరిగిందని పేర్కొంది. కేంద్ర వ్యవసాయశాఖ లె క్కల ప్రకారం.. తెలంగాణలో పత్తి విస్తీర్ణం సాధారణంకన్నా 4 లక్ష ల హెక్టార్ల మేర తగ్గింది. నిరు డు 16.33 లక్షల హెక్టార్లలో సాగుచేయగా ఈ ఏడాది ఆగస్టు 19వరకు 12.5 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ప త్తి అధికంగా పండించే రాషా్ట్రలన్నిట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో 38.58, లక్షల హెక్టార్లు, గుజరాతలో 23.13, ఆంధ్రప్రదేశ్‌లో 3.5 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. దేశం మొత్తంమీద 90 లక్షల హెక్టార్లలో పత్తి వేయగా ఇది ఏడేళ్ల (2008-09) కనిష్ఠ స్థాయి (103.9 లక్షల హెక్టార్లు)కి చేరువైందని, 2014-15లో అత్యధికంగా 128.9 లక్షల హెక్టార్లలో సాగయిందని తెలిపింది.

పైకి వెళ్ళుటకు