హోమ్ / వార్తలు / తలసేమియా చిన్నారులకు ఉచిత వైద్యం
పంచుకోండి

తలసేమియా చిన్నారులకు ఉచిత వైద్యం

తలసేమియా చిన్నారులకు ఉచిత వైద్యం

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించడానికి పిడియాట్రిక్‌ హెమటాలజీ చారిటీ క్లినిక్‌ సిద్ధమైంది. గురువారం బంజారాహిల్స్‌లో ‘‘తలసేమియా సపోర్ట్‌ ఫౌండేషన్‌’’ ను ప్రారంభించింది. భారతదేశంలో దాదాపు 25వేల చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటికే 4వేల మంది పిల్లలు తలసేమియా పేషెంట్లు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు విష్టా ఇమేజింగ్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌ సీఈఓ గోపీకృష్ణ చెప్పారు. ఈక్లినిక్‌ స్వతంత్రంగా సేవలంది స్తుందని, ఇప్పటికే 450పైగా చిన్నారులకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఎవరు కూడా తలసేమియాతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ క్లినిక్‌ను ప్రారంభించామన్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లోని విష్టాస్పెషాలిటీ క్లినిక్‌లో వైద్యం పొందొచ్చని తెలిపారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు క్లినిక్‌ను సంప్రదించొచ్చన్నారు. మొదటిసారి రిజిష్ర్టేషన్‌ ఫీజు రూ.500లు చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు