హోమ్ / వార్తలు / తెలంగాణలో కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల
పంచుకోండి

తెలంగాణలో కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల

కొత్త రాష్ట్రంలో మొత్తంగా 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా... సలహాలు ఇవ్వదలచినా తమకు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలతో పాటు పాత జిల్లాల్లో మార్పులు.. చేర్పులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన అంశాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మహ్మద్ ఆలీ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రంలో మొత్తంగా 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా... సలహాలు ఇవ్వదలచినా తమకు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇందుకు నెల రోజుల పాటు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలు, సలహాలను జిల్లా కల్లెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం సూచించింది. నెల రోజుల తర్వాత వచ్చిన అభిప్రాయాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. సమీక్ష జరిపిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు