హోమ్ / వార్తలు / తెలంగాణలో కొత్త జిల్లాల వారీగా అక్షరాస్యత
పంచుకోండి

తెలంగాణలో కొత్త జిల్లాల వారీగా అక్షరాస్యత

తెలంగాణలో కొత్త జిల్లాల వారీగా అక్షరాస్యత

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాల వారీగా అక్షరాస్యత లెక్కలను వయోజన విద్యా శాఖ తేల్చింది. జిల్లా వారీగా స్త్రీ, పురుషుల అక్షరాస్యత వివరాలతో కూడిన నివేదికను రూపొందించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ లెక్కలు వేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 83.25% అక్షరాస్యత ఉన్నట్లు తేల్చింది. అందులో పురుషుల్లో 86.99 శాతం, మహిళల్లో 79.35% అక్షరాస్యత ఉన్నట్లు వెల్లడించింది. జోగుళాంబ జిల్లాలో అతి తక్కువగా 49.87% అక్షరాస్యత ఉన్నట్లు తెలిపింది. జోగుళాంబ జిల్లాలోని పురుషుల్లో 60.05%, మహిళల్లో 39.48% అక్షరాస్యత ఉన్నట్లు వివరించింది. జాతీయ అక్షరాస్యత 73% కాగా, రాష్ట్రంలో 66.54% అక్షరాస్యత ఉన్నట్లు తెలిపింది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు