హోమ్ / వార్తలు / తెలంగాణలో జాతీయరహదారుల అభివృద్ధికి రూ.8,000 కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసినకేంద్ర రహదారి రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ
పంచుకోండి

తెలంగాణలో జాతీయరహదారుల అభివృద్ధికి రూ.8,000 కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసినకేంద్ర రహదారి రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ

తెలంగాణలో జాతీయరహదారుల అభివృద్ధికి రూ.8,000 కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసినకేంద్ర రహదారి రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ

రహదారుల నిర్మాణంలోవ్యయాలను తగ్గించడానికి, రోడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతికపరిజ్ఞానాన్ని వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేలు,షిప్పింగ్ శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ అన్నారు. రహదారులను నిర్మించడంలో నైతిక ప్రమాణాలు,పర్యావరణం, జీవావరణాలనుముఖ్యమైన మైలురాళ్లుగా ఎంచాలని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి శ్రీ గడ్ కరీ శనివారంప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉదాసీనతను వదలిపెట్టవలసిన సమయం ఆసన్నమైందని, రహదారుల రంగాన్నిపటిష్టపరచడం కోసం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు కదలవలసివుందన్నారు. ఈ రంగంలోవ్యయాలను తగ్గించుకోవడానికి, నాణ్యతను మెరుగుపరచడానికి పరిశోధన, అంతర్జాతీయస్థాయిలో అనుసరించే పద్ధతులను అనుసరించడం తప్పనిసరి అని కేంద్ర మంత్రి తెలిపారు.కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 460 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికిరూ.8,000 కోట్ల ప్రాజెక్టులనుమంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అభివృద్ధికి శ్రీ గడ్ కరీ వేదికపై నుండే ప్రకటించారు.ఇందులో రూ.2,500 కోట్లను ఎన్ హెచ్ 563లో జగిత్యాల- కరీంనగర్- వరంగల్ సెక్షన్ కు (130 కి.మీ.), రూ.2,300 కోట్లను ఎన్ హెచ్ 161లోసంగారెడ్డి- నాందేడ్- అకోలా సెక్షన్ కు (140 కి.మీ.), రూ.1,500 కోట్లను ఒక కొత్తఎన్ హెచ్ లో మంచిర్యాల- చంద్రాపూర్సెక్షన్ కు (90కి.మీ.), అలాగే రూ.1,000 కోట్లను ఒక కొత్త ఎన్ హెచ్ లో సూర్యాపేట- ఖమ్మం సెక్షన్ కు (60కి.మీ.), రూ.700 కోట్లను ఎన్ హెచ్ 365ఎ లో కోదాడ- ఖమ్మం సెక్షన్కు (బైపాస్ కూడా కలుపుకొని 40 కి.మీ.) కేటాయించనున్నారు.

ఆధార: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు