హోమ్ / వార్తలు / తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో ‘నీట్‌’
పంచుకోండి

తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో ‘నీట్‌’

తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో ‘నీట్‌’

వైద్యవిద్యలోజాతీయస్థాయి ఏకీకృత ప్రవేశ పరీక్ష (నీట్‌)-2017 హిందీ, ఆంగ్లంతోపాటు ఆరు ప్రాంతీయ భాషల్లో ఉంటుందని కేంద్ర వైద్య, కుటుంబసంక్షేమశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం హిందీ, ఆంగ్లంతోపాటు తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతీ, అస్సామీ, బెంగాలీల్లో నీట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రాల రిజర్వేషన్ల విధానాలపై ‘నీట్‌’ ప్రభావం ఉండదని అనుప్రియ శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన ఒక రాతపూర్వక సమాధానంలో స్పష్టంచేశారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు