హోమ్ / వార్తలు / దేశంలో నిరుద్యోగ నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప్రభుత్వం
పంచుకోండి

దేశంలో నిరుద్యోగ నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప్రభుత్వం

రెండేళ్ల‌లో 2 కోట్ల మందికి ఉద్యోగాల క‌ల్ప‌న ఉపాధి క‌ల్ప‌న కేంద్రాల ఆధునికీక‌ర‌ణ‌ 2018 నాటికి అన్ని గ్రామాల్లో విద్యుత్వెలుగులు ఉస్మానియా యూనివ‌ర్సిటీ లో వై ఫై స‌దుపాయం “న‌వీన ప‌థంలో ప్ర‌గ‌తి” ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌లోకేంద్ర కార్మిక‌, ఉపాధి శాఖ మంత్రి ద‌త్తాత్రేయ

దేశంలో నిరుద్యోగ నిర్మూల‌నే ల‌క్ష్యంగా తమప్రభుత్వం ప‌నిచేస్తున్నామ‌ని కేంద్ర కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ మంత్రిబండారు ద‌త్తాత్రేయ అన్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో 2 కోట్ల మంది యువ‌తీయువకులకుఉద్యోగాల క‌ల్ప‌న‌ దిశగా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. కేంద్ర స‌మాచార ప్ర‌సారమంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని దృశ్య‌, ప్ర‌క‌ట‌న‌ల విభాగం (డీఏవీపీ) ఏర్పాటు చేసిన “న‌వీన ప‌థంలో ప్ర‌గ‌తి” ఫొటో  ప్ర‌ద‌ర్శ‌న‌నుశుక్ర‌వారం ఆయ‌న తిల‌కించారు. అనంత‌రం మీడియాను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన  సంక్షేమప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఫొటో ప్ర‌ద‌ర్శ‌న ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఈ ఛాయా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేసిన దృశ్య‌, ప్ర‌క‌ట‌న‌ల విభాగాన్నిప్ర‌త్యేకంగా అభినందించారు. దేశంలో ఉపాధి క‌ల్ప‌నాకేంద్రాల‌ను (ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ లు) ఆధునికీక‌రిస్తున్న‌ట్లు ద‌త్తాత్రేయతెలిపారు. ఇందులో భాగంగా ఉస్మానియా వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ నిఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అలాగే ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో వైఫై స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్ర‌ధాన మంత్రి కౌశ‌ల్ వికాస యోజ‌నకింద నిరుద్యోగుల్లో నైపుణ్యాల‌ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. 2018 నాటికి అన్ని గ్రామాల‌కువిద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు తెలిపారు.  అన్ని వ‌ర్గాలప్ర‌జ‌ల స‌మ్మిళిత అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్న‌ట్లు చెప్పారు. గ్రామీణఅభివృద్ధి కోసం రూ.2.12 ల‌క్ష‌ల కోట్లు కేటాయించామ‌న్నారు. గ‌త రెండేళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ.1.12 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చిన ఘ‌న‌తఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అని ప్ర‌గాఢంగావిశ్వ‌సిస్తున్నామ‌ని, ఈ దిశ‌గా స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తోముందుకెళ్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశంలో ర‌హ‌దారుల నిర్మాణం కోసం రూ.2ల‌క్షల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామ‌న్నారు. కార్మికుల‌కు కనీస పింఛ‌న్ ను వెయ్యి రూపాయ‌ల‌కు పెంచామ‌ని, అలాగే బోన‌స్ను రూ.3500 నుంచి రూ.7 వేలకు పెంచినట్లు తెలిపారు. ద‌ళిత, గిరిజ‌నులు స్వ‌శ‌క్తితోఎదిగేందుకు స్టార్ట‌ప్ ఇండియా, స్టాండ‌ప్ ఇండియా లాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నవిష‌యాన్ని మంత్రి గుర్తుచేశారు. రైతు ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ కోసం ప్ర‌ధాన మంత్రికృషి సించాయ్ యోజ‌న‌, ప్రధాన మంత్రి ఫ‌స‌ల్బీమా యోజ‌న‌ను ప్రారంభించామ‌న్నారు. ముద్రా బ్యాంక్  దాదాపు 5 కోట్ల మంది చిరువ్యాపారులకు మేలు చేకూర్చుతుంద‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో  తెలంగాణ ఆర్టీసీఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ నాగ‌రాజు, ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం అసిస్టెంట్డైరెక్ట‌ర్ ర‌త్నాక‌ర్‌, డీఏవీపీ క్షేత్ర ప్ర‌ద‌ర్శ‌నఅధికారిణి క్రిష్ణ వంద‌న‌, డీఏవీపీ క్షేత్ర ప్ర‌ద‌ర్శ‌నస‌హాయ‌కుడు మాంకాళి శ్రీ‌నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆధారము: ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం, హైద‌రాబాద్‌.

 

 

 

పైకి వెళ్ళుటకు