హోమ్ / వార్తలు / దేశవ్యాప్తంగా సోలార్ సిటీ ప్రోగ్రామ్ కింద రూ. 67.01 కోట్ల మంజూరు
పంచుకోండి

దేశవ్యాప్తంగా సోలార్ సిటీ ప్రోగ్రామ్ కింద రూ. 67.01 కోట్ల మంజూరు

దేశవ్యాప్తంగా సోలార్ సిటీ ప్రోగ్రామ్ కింద రూ. 67.01 కోట్ల మంజూరు

సోలార్ సిటీ ప్రోగ్రామ్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 67.01 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.  ఈ ప్రాజెక్టులో భాగంగా మాస్టర్ ప్లాన్ లు రూపొందించడం, సోలార్ సిటీ సెల్స్, ప్రచార కార్యకలాపాలు, పునరుత్సాదక శక్తికి సంబంధించిన ప్రాజెక్టుల ఇనిస్టిలేషన్ లకు గాను   రూ. 24.16 కోట్లను మంజూరు చేయడం జరిగింది.  కేంద్ర విద్యుత్, బొగ్గు, పునరుత్పాదక శక్తి వనరులు, గనుల శాఖ సహాయ మంత్రి  (స్వతంత్ర హోదా) శ్రీ పీయూష్ గోయల్ ఈ వివరాలను ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా రాజ్యసభలో ఈ రోజు వెల్లడించారు.  మహారాష్ట్రలోని గుర్తించిన 7 సోలార్ పట్టణాలకు రూ. 7.74 కోట్లను మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 6 పట్టణాలకు గాను రూ. 3.04 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు.  అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సోలార్ సిటీస్ గా విజయవాడ, కాకినాడ, నర్సాపురం టౌన్ ఎంపికవ్వగా, వీటిలో విజయవాడ పట్టణానికి రూ. 1.96 కోట్లను మంజూరు చేయగా, ఇప్పటికే రూ. 0.90 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది.  నర్సాపురం టౌన్ కు రూ. 0.50 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశారు.  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహబూబ్ నగర్ పట్టణం సోలార్ సిటీ ప్రోగ్రామ్ లో ఎంపికవ్వగా, కేంద్రం మంజూరు చేసిన నిధుల జాబితాలో ఇప్పటివరకు ఈ పట్టణానికి కేటాయింపులు జరగలేదు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు