హోమ్ / వార్తలు / దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ వారోత్సవాలు
పంచుకోండి

దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ వారోత్సవాలు

దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ వారోత్సవాలు

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టి అక్టోబరు 2వ తేదీకి రెండేళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ వారోత్సవాలు నిర్వహించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, పంచాయతీలు, పట్టణ, పురపాలక సంస్థలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాముల్ని చేయనుంది. వారంపాటు వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరుగా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఇండోసాన్‌-2016 పేరి ట కేంద్ర పట్టణాభివృద్ధి, కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖలు సెప్టెంబరు 30న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో భారత పారిశుధ్య సదస్సును నిర్వహించనున్నాయి. సదస్సు కు అన్ని రాషా్ట్రల సీఎంలు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యశాఖల మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, 677 జిల్లాల ప్రజాప్రతినిధులు, 500 అమృత్‌ పట్టణాల మున్సిపల్‌ కమిషనర్లు, మేయర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటురంగ ప్రతినిధులు హాజరవుతారు. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభిం చి.. పారిశుధ్యానికి సంబంధించి 11విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు. రెండేళ్లలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యపరంగా తెచ్చిన మార్పులను సమీక్షించటంతోపాటు 2019 నాటికి పరిశుభ్ర భారతాన్ని సాధించేందుకు అత్యున్నత రాజకీయ స్థాయిలో లక్ష్యాలను సదస్సు మెరుగుపర్చనుంది. వారోత్సవాల్లో దేశంలోని వంద ఐకానిక్‌ ప్రాంతాల్లో పదింటిలో పరిశుభ్ర తా కార్యక్రమాలు చేపడతారు. శుభ్రతపై చాయ్‌పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తా రు. పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో చౌపాల్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు