హోమ్ / వార్తలు / నగరంలోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఉచిత వైఫై సౌకర్యం
పంచుకోండి

నగరంలోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఉచిత వైఫై సౌకర్యం

నగరంలోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఉచిత వైఫై సౌకర్యం

నగరంలోని ప్రధాన పర్యాటక కేంద్రాలు, పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, గిరిజనాభివృద్ధి శాఖల మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లోని 25 పర్యాటక క్షేత్రాలు, ఏడు పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లలో నెల రోజుల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సచివాలయంలో పర్యాటక శాఖ కార్యదర్శి బీ.వెంకటేశం, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా చోంగ్తూతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్‌, బిర్లా మందిర్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, ఎనటీఆర్‌ గార్డెన్స, తారామతి బరాదరి, మక్కామసీదు, కులీ కుతుబ్‌షా టూంబ్స్‌, బిర్లా సైన్స సెంటర్‌, నెహ్రూజూ లాజికల్‌ పార్క్‌, హుస్సేనసాగర్‌, లుంబినీ పార్క్‌, స్టేట్‌ ఆర్కియాలజీ మ్యూజియం (పబ్లిక్‌ గార్డెన్స) దుర్గం చెరువు, శిల్పారామం, శామీర్‌పేట, పైగా టూంబ్స్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, చిల్కూరు బాలాజీ టెంపుల్‌, రామోజీ ఫిలింసిటీ, పర్యాటకభవన, కేబీఆర్‌పార్క్‌, మౌలాలీదర్గా, గండిపేట్‌ కేంద్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభవృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక భవన టూరిజం ప్లాజా హోటల్‌, తారామతిబరాదరి రిసార్ట్స్‌, హరితహోటల్‌ కీసరగుట్ట, హరిత శామీర్‌పేట రిసార్ట్‌, హరిత అనంతగిరి రిసార్ట్‌, హరిత దుర్గంచెరువు (సమ్‌ఽథింగ్‌ ఫిష్‌ రెస్టారెంట్‌) లుంబినీపార్క్‌-యూనిట్స్‌-2లలో ఉచిత వైఫై సేవలుంటాయన్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు