హోమ్ / వార్తలు / నిధుల విడుదలకు కేంద్రం ఆదేశం
పంచుకోండి

నిధుల విడుదలకు కేంద్రం ఆదేశం

నిధుల విడుదలకు కేంద్రం ఆదేశం

దేశంలో పది రాష్ట్రాలు కరవు కోరల్లో చిక్కుకోవడంతో పశుగ్రాసం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి వివిధ పథకాల కింద నిధుల్ని విడుదల చేయాలని కేంద్రం వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనిదినాలు కల్పించాలని ఆదేశించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి పి.కె.సిన్హా సోమవారం సమీక్ష నిర్వహించారు. కరవు నివారణ చర్యల నిమిత్తం రాష్ట్రాలకు రూ.10,000 కోట్లకు పైగా సాయం అందించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఏయే చర్యలు చేపట్టాలో సూచించారు. రాష్ట్రాల విపత్తు స్పందన నిధుల నుంచి తక్షణం కరవు సాయాన్ని విడుదల చేయాలని రాష్ట్రాలకు సిన్హా సూచించారు. ఖరీఫ్‌, రబీ కాలాల్లో వర్షపాత లోటు గురించి కేంద్ర కరవు సహాయ కమిషనర్‌ సవివర నివేదిక సమర్పించారు. మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతానికి నీటిని పంపించడానికి వీలుగా దిల్లీ ప్రజలంతా రోజూ కొంత నీరు పొదుపు చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు