హోమ్ / వార్తలు / నిర్ణీత కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిర్ణీత కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌

నింగిలోకి పంపిన భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 10న నింగిలోకి పంపిన భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)-1ఎఫ్‌ ఉపగ్రహం సోమవారం నిర్ణీత కక్ష్యలోకి చేరింది. 11, 12, 13 తేదీల్లో లిక్విడ్‌ అపోజి ఇంజిన్‌ మండించి ఉపగ్రహం కక్ష్య పెంచుతూ పోయారు. సోమవారం ఉదయం చివరిగా ఉపగ్రహంలోని ఇంజిన్‌ను 78.8 సెకన్ల పాటు మండించి 36 వేల కిలోమీటర్ల భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు సంకేతాలూ వచ్చాయి. ఇది ఏప్రిల్‌ నుంచి పనిచేయడం ప్రారంభించనుంది.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు