హోమ్ / వార్తలు / నేటి అర్ధరాత్రి వరకూ ఆస్తి పన్ను చెల్లించొచ్చు
పంచుకోండి

నేటి అర్ధరాత్రి వరకూ ఆస్తి పన్ను చెల్లించొచ్చు

నేటి అర్ధరాత్రి వరకూ ఆస్తి పన్ను చెల్లించొచ్చు

హైదరాబాద్‌: ఆస్తి పన్ను చెల్లించేందుకు గురువారం ఆఖరి తేదీ అయినందున పన్ను చెల్లింపుదారులను దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి వరకూ పౌర సేవా కేంద్రాలు తెరిచి ఉంచుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేసిందని తెలిపారు. గురువారం రాత్రి వరకూ పూర్తిగా పన్ను చెల్లించినట్లయితే వడ్డీ మాఫీ అవుతుందన్నారు. ఈ సదుపాయాన్ని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆఖరి రోజున పెద్ద ఎత్తున పన్ను చెల్లించేందుకు ప్రజలు వస్తారన్న ఉద్దేశంతో అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు అర్ధరాత్రి వరకూ పనిచేస్తాయని స్పష్టం చేశారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు