హోమ్ / వార్తలు / నేటి నుంచి ఏటీఎంలు రెడీ!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: Review in Process

నేటి నుంచి ఏటీఎంలు రెడీ!

నేటి నుంచి ఏటీఎంలు రెడీ!

నోట్ల రద్దు కష్టాలతో అల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి.. రోజువారీ ఖర్చులకు డబ్బుల కోసం బ్యాంకుల ముందు చేంతాడంత లైన్లలో నుంచుంటున్న సాధారణ పౌరులకు నేటి నుంచి ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. రెండు రోజులుగా మూతపడిన వీటిని బ్యాంకులు శుక్రవారం నుంచి తెరవనున్నాయి. ఈ సౌలభ్యం ప్రధాన పట్టణ, నగర ప్రాంతాలకు తప్ప గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో వచ్చే పరిస్థితి కనిపించట్లేదని క్షేత్రస్థాయి సమాచారం. ఏటీఎం సేవలు నోట్ల రద్దుకు ముందు ఉన్నప్పటిలా అందుబాటులోకి రావాలంటే అందుకు కనీసం పది రోజులు పట్టే అవకాశం ఉందని ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ వర్గాలు తెలిపాయి. దీనికి కారణం.. ఏటీఎం సేవలు అందించే వెండర్ల సంఖ్య మనదేశంలో చాలా తక్కువ. దేశవ్యాప్తంగా దాదాపు 2.2 లక్షల దాకా ఏటీఎంలున్నాయి. కానీ.. దేశంలో ఏటీఎం సేవలందించే ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌, హిటాచీ వంటి సంస్థలు 3-4 మాత్రమే ఉన్నాయని.. కాబట్టి పది రోజుల సమయం పడుతుందని ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అన్నారు.
పైకి వెళ్ళుటకు