హోమ్ / వార్తలు / నేటి నుంచి ఒంటిపూట బడులు
పంచుకోండి

నేటి నుంచి ఒంటిపూట బడులు

నేటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బడులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మంగళవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఉపాధ్యాయ సంఘాల భేటీ సందర్భంగా ఒంటిపూట బడుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకే పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పని చేస్తాయి. ప్రభుత్వ బడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ బడులు సైతం ఒంటిపూట బడులను కొనసాగించాల్సి ఉంటుంది.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు