హోమ్ / వార్తలు / నేటి నుంచి టీఎస్‌ ఎంసెట్‌-3 కౌన్సెలింగ్‌
పంచుకోండి

నేటి నుంచి టీఎస్‌ ఎంసెట్‌-3 కౌన్సెలింగ్‌

నేటి నుంచి టీఎస్‌ ఎంసెట్‌-3 కౌన్సెలింగ్‌

2016-17 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌, బీడీఎ్‌సలలో ప్రవేశాల భర్తీ కోసం నిర్వహించిన టీఎస్‌ ఎంసెట్‌-3 ర్యాంకర్లకు శనివారం నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌లో నగరంలో రెగ్యులర్‌ ర్యాంకుల కోసం మూడు సెంటర్లు, ప్రత్యేక కేటగిరీల విద్యార్థులకు ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. నగరంలో ఏ కేంద్రంలో కేటాయించిన ర్యాంకర్లు ఆయా తేదీల్లో అక్కడే హాజరై సర్టిఫికెట్లను పరిశీలించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు