హోమ్ / వార్తలు / నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు
పంచుకోండి

నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు

టెట్‌ దరఖాస్తులు నేటి నుంచి

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్‌టెట్‌)కు బుధవారం నుంచి దరఖాస్తులు మొదలుకానున్నాయి. పరీక్షకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అధికారులు tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఉంచారు. తెలంగాణ రాష్ట్ర విద్యా, పరిశోధన మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)లో సహాయ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. మే 1వ తేదీన జరగనున్న పరీక్షకు దాదాపు 5 లక్షల మంది హాజరుకావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు