హోమ్ / వార్తలు / నేటి నుంచి డి ఫార్మసీ కౌన్సెలింగ్‌
పంచుకోండి

నేటి నుంచి డి ఫార్మసీ కౌన్సెలింగ్‌

నేటి నుంచి డి ఫార్మసీ కౌన్సెలింగ్‌

ఇంటర్‌ విద్యార్హతతో డి ఫార్మసీ కోర్సులో ప్రవేశం కోసం బుధవారం కౌన్సెలింగ్‌ జరగనుంది. బుధవారం ధ్రువపత్రాల పరిశీలన, బుధ, గురువారాల్లో వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని ప్రవేశాల కన్వీనర్‌ డా॥ఎంవీరెడ్డి తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 20న రాత్రి 8 గంటల తర్వాత సీట్లు కేటాయిస్తారు. మొత్తం 830 డి ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా ఈ కౌన్సెలింగ్‌కు 409 మాత్రమే అర్హులున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు హైదరాబాద్‌, మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మరిన్ని వివరాలను https://tsdpharm.nic.inద్వారా తెలుసుకోవచ్చు.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు