హోమ్ / వార్తలు / నేటి నుంచి బయో ఏషియా సదస్సు
పంచుకోండి

నేటి నుంచి బయో ఏషియా సదస్సు

నేటి నుంచి బయో ఏషియా సదస్సు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా – 2017 సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. హెచ్‌ఐసీసీలో సోమవారం నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభిస్తారని నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ కుర్త్‌ ఉత్రిచంద్, డాక్టర్‌ పాల్‌ స్టోఫెల్స్‌లకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును గవర్నర్‌ అందజేస్తారు. అంతకుముందు షామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీలో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరిస్తారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు