హోమ్ / వార్తలు / నేటి నుంచి హైదరాబాద్‌ నగరంలో వీధి వ్యాపారుల పాలసీ
పంచుకోండి

నేటి నుంచి హైదరాబాద్‌ నగరంలో వీధి వ్యాపారుల పాలసీ

నేటి నుంచి హైదరాబాద్‌ నగరంలో వీధి వ్యాపారుల పాలసీ

గాంధీ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి నగరంలో వీధి వ్యాపారుల పాలసీ అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. స్ర్టీట్‌ వెండర్స్‌ యాక్ట్‌ 2014 ప్రకారం వీధి వర్తకులకు కల్పించాల్సిన సౌకర్యాలు.. వారి హక్కులు.. రక్షణపై అవగాహన కల్పించనున్నారు. నేషనల్‌ అర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వీధి వ్యాపారులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. సర్కిల్‌ స్థాయిలో 20 శాతం అధికారులు, 40 శాతం వీధి వ్యాపారుల సంఘం సభ్యులు, 20 శాతం సామాజిక సంస్థల ప్రతినిధులతో టౌన్‌ వెండింగ్‌ కమిటీలు ఏర్పాటుచేయనున్నారు. జీహెచ్‌ఎంసీ గతంలో ప్రారంభించిన వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 5782 మందిని గుర్తించారు. గ్రేటర్‌లోని 24 సర్కిళ్లలో వీధి వ్యాపారుల జోన్లు గుర్తించేందుకు పట్టణ ప్రణాళికా విభాగం కసరత్తు ప్రారంభించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి
పైకి వెళ్ళుటకు