హోమ్ / వార్తలు / నేటి నుంచే పీజీ ఈసీ/ఈసెట్‌ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన
పంచుకోండి

నేటి నుంచే పీజీ ఈసీ/ఈసెట్‌ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచే పీజీ ఈసీ/ఈసెట్‌ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన

2016-17వ విద్యా సంవత్సరంలో ఎమ్‌ఈ, ఎంటెక్‌, ఎం ఆర్క్‌, ఎం ఫార్మసీ, ఫార్మా డీ (పీబీ) బ్రాంచీల్లో ప్రవేశాల భర్తీ ప్రక్రియలో పీజీ ఈసీ/పీజీ ఈసెట్‌ ర్యాంకర్ల సర్టిఫికెట్లను బుధవారం నుంచి 26వ తేదీ వరకు పరిశీలించనున్నారు. దీనికి గాను ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ ఐదు కేంద్రాలు క్రింద విధంగా ఉన్నాయి:

  1. జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి
  2. యూనివర్సిటీ పీజీ కాలేజ్‌, సికింద్రాబాద్‌
  3. నిజాంకాలేజ్‌, బషీరాబాగ్‌
  4. ఏవీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామ ర్స్‌, గగన్‌మహల్‌, దోమలగూడ
  5. జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, మాసాబ్‌ట్యాంక్‌.

ఆధారం : ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు