హోమ్ / వార్తలు / నేడు ఆర్థోప్లాస్టీపై జాతీయ సదస్సు
పంచుకోండి

నేడు ఆర్థోప్లాస్టీపై జాతీయ సదస్సు

దేశవ్యాప్తంగా 450 మంది ఆర్థోపెడిక్‌ వైద్యులు, పీజీ వి ద్యార్థులు ఈ సదస్సు కోసం గుంటూరు వస్తున్నారు.

గుంటూరులో శని, ఆదివారాల్లో నగరంలో తొలిసారిగా జాతీయ స్ధాయి ఆర్థోప్లాస్టీ లైవ్‌ సర్జరీ వర్క్‌షాప్‌ ని ర్వహిస్తున్నారు. మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించి జాతీయ స్ధాయి సదస్సును విజయవంతంగా చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 450 మంది ఆర్థోపెడిక్‌ వైద్యులు, పీజీ వి ద్యార్థులు ఈ సదస్సు కోసం గుంటూరు వస్తున్నారు. సదస్సులో జరిగే లైవ్‌ సర్జికల్‌ వర్క్‌షాప్‌లో పది ఆర్థ్ధోప్లాస్టీ శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలతో పాటు ఒకసారి ఆపరేషన చేయించుకున్న రోగిలో అది ఫెయుల్‌ అయినప్పుడు తిరిగి మరోసారి ఆపరేషన చేసే ‘రివిజన నీ రీ ప్లేస్‌మెంట్‌’ శస్త్రచికిత్సలను కూడా ఈ లైవ్‌ సర్జికల్‌ డెమానసే్ట్రషనలో నిర్వహించడం విశే షం

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు