హోమ్ / వార్తలు / నేడు తెలంగాణలోని వైద్యవిద్య నాలుగో విడత కౌన్సెలింగ్‌
పంచుకోండి

నేడు తెలంగాణలోని వైద్యవిద్య నాలుగో విడత కౌన్సెలింగ్‌

నేడు తెలంగాణలోని వైద్యవిద్య నాలుగో విడత కౌన్సెలింగ్‌

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా వైద్యవిద్య సీట్ల భర్తీ నాలుగో విడత కౌన్సెలింగ్‌ మంగళవారం నిర్వహించనున్నారు. మూడో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళొజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞానవిశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి తెలిపారు. 4న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చని, ఇప్పటికే నిజ ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులే అర్హులన్నారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు