హోమ్ / వార్తలు / న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో300 ఆఫీసర్‌ ఉద్యోగాలు
పంచుకోండి

న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో300 ఆఫీసర్‌ ఉద్యోగాలు

న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో300 ఆఫీసర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్సూరెన్సకు చెందిన ‘ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌’ 300 అడ్మినిస్టేటివ్ ఆఫీసర్స్‌(జనరలిస్ట్స్‌), (స్కేల్‌-ఐ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. అన్ని అలవెన్సులతో కలిపి మూలవేతనం నెలకు రూ. 51,000 వరకు ఉంటుంది. 30 ఏళ్లలోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానంలో ఉండే ఈ పరీక్షలు ఆనలైనలోనే రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 60 నిమిషాల్లో 100 మార్కులకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలు ఉంటాయి.
మెయిన్‌లో 200 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టీవ్‌, మరొకటి డిస్ర్కిప్టీవ్‌. ఈ రెండూ ఆన్‌లైన్‌లోనే రాయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు కంప్యూటర్‌ టైపింగ్‌ వచ్చి ఉండాలి. మెరిట్‌ అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన(ఐబిపిఎస్‌) ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి నిర్వహించే పరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స) మాదిరిగానే ‘ద న్యూ ఇండియా అస్యూరెన్స’ కంపెనీ నిర్వహించే పరీక్ష ఉంటుంది. బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతున్న వారు కూడా ఈ ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే ప్రిపరేషనతో రెండు ఉద్యోగాలకు ప్రయత్నించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2016 అక్టోబరు 14 నుంచి
ఫేజ్‌-1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్‌): 2016 డిసెంబర్‌ 17
ఫేజ్‌-2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్‌+డిస్ర్కిప్టివ్‌): 2017 జనవరి
వెబ్‌సైట్‌: www.newindia.co.in/recruitment-notice3.aspx

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు