హోమ్ / వార్తలు / పీఎఫ్‌ వడ్డీపై 19న నిర్ణయం కనీసం 8.8% కొనసాగే అవకాశం
పంచుకోండి

పీఎఫ్‌ వడ్డీపై 19న నిర్ణయం కనీసం 8.8% కొనసాగే అవకాశం

పీఎఫ్‌ వడ్డీపై 19న నిర్ణయం కనీసం 8.8% కొనసాగే అవకాశం

భవిష్య నిధి (పి.ఎఫ్‌.)పై 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని వడ్డీగా చెల్లించాలనే విషయంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ధర్మకర్తలు ఈ నెల 19న నిర్ణయం తీసుకోనున్నారు. కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశం వచ్చే సోమవారం జరగనుంది. గత ఏడాదికి నిర్ణయించిన 8.8 శాతానికి తగ్గకుండా 16-17 ఆర్థిక సంవత్సరానికీ నిర్ణయించవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా వంటి ఇతర చిన్నమొత్తాల పొదుపుపై ఇటీవల వడ్డీ శాతాన్ని స్వల్పంగా తగ్గించినందువల్ల ఈపీఎఫ్‌పైనా తగ్గుతుందని వూహాగానాలు ఉండేవి. ఈపీఎఫ్‌లో జమ అవుతున్న మొత్తాలు ఏమాత్రం తగ్గకపోవడంతో వడ్డీనీ కనీసం ఇప్పుడున్న మాదిరిగానైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు