హోమ్ / వార్తలు / పుష్కరాల బస్సుల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌
పంచుకోండి

పుష్కరాల బస్సుల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌

పుష్కరాల బస్సుల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌

కృష్ణా పుష్కరాలకు వెళ్లే 74 ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ రిజర్వేషన్‌ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌పై ప్రయాణి కులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు. మొదటి రోజు 600 మంది ప్రయాణికులు రిజర్వేషన్‌ చేసుకున్నట్టు రంగారెడ్డి రీజియన్‌ అధికారులు తెలిపారు. ఈనెల 12 నుంచి కృష్ణా పుష్కరాల కోసం ఎంజీబీఎస్‌ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. శ్రీశైలం, విజయవాడ, బీచుపల్లి, నాగార్జునసాగర్‌లోని పుష్కర ఘాట్లకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు అందు బాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయా ణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు. 50 మంది ప్రయాణికులు కలిసి బుక్‌ చేసుకుంటే వారి వద్దకే బస్సును పంపుతామని చెప్పారు. ఇతర వివరాలకు ఎంజీబీఎస్‌ -8330933419, 83309333537, జేబీఎస్‌ -040-27802203, 9959226246 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు