హోమ్ / వార్తలు / పోటీ పరీక్షల గరిష్ఠ వయో పరిమితి జీఓ ఏడాది పొడిగింపు
పంచుకోండి

పోటీ పరీక్షల గరిష్ఠ వయో పరిమితి జీఓ ఏడాది పొడిగింపు

పోటీ పరీక్షల గరిష్ఠ వయో పరిమితి జీఓ ఏడాది పొడిగింప

ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితి పెంపు జీఓను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.టక్కర్‌ సోమవారం ఉత్తర్వుల్ని జారీచేశారు. వయో పరిమితిని 34 నుంచి 40 సంవత్సరాల వరకు పెంచుతూ 2014లో జారీచేసిన జీఓ కాల పరిమితి గత నెల 30వ తేదీతో ముగిసింది. దీని కాలపరిమితిని మరో ఏడాది వరకు అంటే వచ్చే సెప్టెంబరు 30వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన 4009 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీ వరకు మాత్రమే వయో పరిమితి పెంపు కాల పరిమితిని పొడిగించాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. తాజా ఉత్తర్వుల్లో ఉద్యోగ ప్రకటనల జారీ ప్రస్తావనే లేదు. ఏపీపీఎస్సీ వంటి నియామక సంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని జీఓలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరులోగా జారీచేసే ఏ నోటిఫికేషన్‌కైనా వయో పరిమితి పెంపు నిర్ణయం వర్తిస్తుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు