హోమ్ / వార్తలు / పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగాల కొర‌కై ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన వారికి సూచ‌న‌లు
పంచుకోండి

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగాల కొర‌కై ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన వారికి సూచ‌న‌లు

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగాల కొర‌కై ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన వారికి సూచ‌న‌లు

మార్చి 14, 15, 30 వ తేదీల‌లో గ్రామీణ డాక్ సేవ‌క్ మెయిల్ డెలివ‌రీ ఏజెంట్లు, గ్రామీణ డాక్ సేవ‌క్ మెయిల్ ప్యాక‌ర్స్ పోస్టుల‌కు హైద‌రాబాద్ సిటీ డివిజ‌న్‌, హైద‌రాబాద్ జీపీఓ ప‌రిధిలో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన వారికి ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియ మే 7వ తేదీ నుండి మొద‌ల‌వుతుంద‌ని హైద‌రాబాద్ సిటీ డివిజ‌న్ సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ శ్రీ కె. సుధీర్ బాబు తెలిపారు.  అభ్య‌ర్థులు వారి సంబంధిత పోస్టాఫీసుల‌లో ఈ కింద‌   సూచించిన తేదీల‌లో ఉద‌యం 11 గంట‌ల త‌రువాత హాజ‌రు కావ‌ల‌సి ఉంటుంది.

1.    చీఫ్ పోస్ట్ మాస్ట‌ర్, హైద‌రాబాద్ జీపీఓ, గ్రౌండ్ ఫ్లోర్‌, అబిడ్స్.  మే 7, 2016.

2.    అసిస్టెంట్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కార్యాల‌యం, హైద‌రాబాద్ ప‌శ్చిమ స‌బ్ డివిజ‌న్‌, జీపీఓ కాంప్లెక్స్‌, 3వ అంత‌స్తు - మే 11నుండి మే 14వ తేదీ వ‌ర‌కు, మే 28 నుండి మే 31, 2016 వ‌ర‌కు.

3.    అసిస్టెంట్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కార్యాల‌యం, హైద‌రాబాద్ ప‌శ్చిమ స‌బ్ డివిజ‌న్‌, జీపీఓ కాంప్లెక్స్‌, 3వ అంత‌స్తు - మే 17నుండి మే 20వ తేదీ వ‌ర‌కు, మే 24 నుండి మే 27, 2016 వ‌ర‌కు.

ఆధారము: ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం

పైకి వెళ్ళుటకు