హోమ్ / వార్తలు / ప్రమాదరహిత తెలంగాణ కోసం 17 నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు
పంచుకోండి

ప్రమాదరహిత తెలంగాణ కోసం 17 నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు

ప్రమాదరహిత తెలంగాణ కోసం 17 నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు

రవాణా శాఖను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతూ ప్రమాద రహిత తెలంగాణ సాధించే వరకు కృషి చేస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్‌ పి.మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ ప్రమాద మృతుల సంఖ్య సైబరాబాద్‌లో 1125 ఉండగా, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాలు ఉన్నాయన్నారు. విద్యా సంస్థలతో పాటు ఇతర సంస్థల తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జేటీసీ వెంకటేశ్వర్లు, తెలంగాణ మోటార్‌ వెహికిల్స్‌ ఇన్‌స్పెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పాపారావు, పుప్పాల శ్రీనివాస్‌, డీటీసీ ప్రవీణ్‌రావు, ఎంవీఐ దుర్గాదాస్ లు పాల్గొన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు